వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక బంగారంగా మారింది. 2019 ఎన్నికలకు ముందు వెయ్యి రూపాయలు లభ్యమైన ట్రక్కు ఇసుక ఇప్పుడు నాలుగు వేల నుంచి 5 వేలు వరకు చేరింది. ఇసుక అవసరమైనప్పుడల్లా దొరకడం లేదని నిర్మాణదారులు వాపోతున్నారు. ఇసుక విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన విధానాలు అక్రమార్కులు జేబులు నింపుతున్నాయే తప్ప, ప్రజలకు మాత్రం రోజుకు రోజుకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ప్రైవేటుగా ప్రజలు నిర్మించుకుంటున్న ఇళ్లకి ఇసుక, మట్టి దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.