ప్రతిపక్ష నేత చంద్రబాబు పెత్తందారుల పక్షం.. సీఎం వైయస్ జగన్ పేదల పక్షమని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార శాఖల మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ తెలిపారు. బీసీల కష్టాలకు కారణమెవరు? చంద్రబాబు కాదా? బీసీలను ప్రధానంగా పెద్ద సంక్షోభం నుంచి బయటపడేసింది మా ప్రభుత్వం తీసుకున్న దార్శనిక నిర్ణయాలు కాదా? మీరు ఏకపక్షంగా ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలను కూడా చెడుగా చూపుతున్నారు. ఈ పత్రిక లు చదివిన వెంటనే మనసులు కలచి వేసేలా రాతలు ఉంటున్నాయి. కళ్లెదురుగానే నిజాలు కనిపిస్తుంటే... అబద్ధాలను రాస్తారు. తద్వారా చంద్రబాబుకు లబ్ధి చేకూర్చాలన్నదే మీ లక్ష్యం అని కొన్ని పత్రికలను ఉద్దేశించి మాట్లాడారు.
![]() |
![]() |