ఉక్రెయిన్‌పై రష్యా ఇటీవల 76 క్షిపణులతో దాడులు చేసింది. విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని రష్యా చేసిన దాడులతో పలు నగరాలు అంధకారంలో మగ్గిపోయాయి. గడ్డకట్టించే చలిలో విద్యుత్ సదుపాయం లేకుండా చేస్తే ఆ చలిని తట్టుకోలేక సైనికులు, పౌరులు ఉక్రెయిన్ వీడి వెళ్లిపోతారన్న వ్యూహంతో రష్యా ఈ దాడులకు దిగింది. చాలా నగరాల్లో జీరో కంటే తక్కువకి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. విపరీతమైన చలి వణికిస్తున్న వేళ విద్యుత్ లేకపోవడంతో హీటర్లు పని చేయక ప్రజలు గడ్డకట్టుకుపోతున్నారు. ప్రస్తుతం అధికారులు విద్యుత్ పునరుద్ధరణ కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు.