కేరళలోని కొట్టాయంకు చెందిన ఓ నర్సు.. తన ఇద్దరి పిల్లలతో సహా లండన్ లో భర్త చేతిలో హత్యకు గురైంది. కొట్టాయంకు చెందిన అశోకన్ కుమార్తె అంజు.. తన భర్త, పిల్లలతో కలిసి లండన్ లో నివాసం ఉంటోంది. అంజు భర్త సాజు హోటల్ లో వెయిటర్ గా పనిచేసేవాడు. 4 నెలల క్రితం ఉద్యోగం కోల్పోయి రోజూ భార్యతో గొడవపడేవాడు. ఈ క్రమంలో చివరకు ఊపిరాడకుండా చేసి భార్యా పిల్లలను చంపేశాడు. శుక్రవారం అంజుకు స్నేహితులు ఫోన్ చేయగా సమాధానం లేకపోవడంతో ఇంటికి వచ్చి చూశారు. విగతజీవులై పడి ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా నిందితుడు సాజును అరెస్ట్ చేశారు.