తెలుగుదేశం పార్టీతోనే ప్రజా సంక్షేమం సాధ్యమని పాణ్యం నియోజకవర్గ టీడీపీ ఇనచార్జ్, మాజీ ఎమ్మెల్యే గౌరుచరిత అన్నారు. కల్లూరు మండలంలోని చెట్లమల్లాపురం గ్రామంలో చేపట్టిన ‘ఇదేం ఖర్మ- మన రాష్ట్రానికి ’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గ్రామంలో పర్యటించి ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే గౌరుచరిత మాట్లాడుతూ.... అధికారంలోకి వచ్చేందుకు అనేక హామీలు ఇచ్చిన జగన్ వాటిని విస్మరించారని ఆరోపించారు. ప్రజలు మోయలేని ఆర్థిక భారం మోపుతున్నారని ఆరోపించారు. సంక్షేమం ముసుగులో అన్నివర్గాల ప్రజలకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వాకిటి మాధవి, టీడీపీ నాయకులు తిమ్మారెడ్డి, దామోదర్‌రెడ్డి, మాధేష్, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.