వైసీపీ పాలనలో వడ్రంగులకు పనులు లేక పూట గడవని పరిస్థితి ఏర్పడిందని కర్నూల్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ అన్నారు. సోమయాజులపల్లె మజరా గ్రామమైన చెన్నంచెట్టి పల్లె గ్రామంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.... రాష్ట్రంలో వడ్రంగులు, ఇతర చేతి వృత్తులవారు పనులు లేక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అనంతరం వీధుల్లో తిరుగుతూ ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బజారు, నాగమల్లి, వెంకటసుబ్బయ్య, యగంటయ్య, మధు శేఖర్, గోపాలకృష్ణ, పురుషోత్తం, రామాంజినేయులు, వేణు పాల్గొన్నారు.