ఏపీ పాఠశాలల్లో సీబీఎ్‌సఈ విధానం తీసుకొస్తున్న దృష్ట్యా పాఠ్య పుస్తకాల్లో రెండు సెమిస్టర్ల విధానం తీసుకొస్తున్నట్లు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రకటించింది. ప్రస్తుతం 1 నుంచి 5 తరగతులకు మూడు సెమిస్టర్లు, 6 నుంచి 8 తరగతులకు రెండు సెమిస్టర్లు, 9, 10 తరగతులకు ఒక సెమిస్టర్‌గా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. 2023-24 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 9 తరగతుల వరకు సీబీఎ్‌సఈ విధానం నేపథ్యంలో రెండు సెమిస్టర్లు అమలుచేస్తారు. 2024-25లో పదో తరగతికీ దీన్ని అమలుచేస్తారు. కాగా, ముందు దీనిపై ఉపాధ్యాయులతో సమగ్రంగా చర్చించాకే నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి సూచించారు.