ఆరోగ్యం, పారిశుద్ధ్యం తదితర ప్రజాసేవలు, కనీస మెటీరియల్ కాంపోనెంట్‌తో కూడిన మిశ్రమ సేవలపై జీఎస్టీ మినహాయింపునివ్వాలని రాష్ట్ర ఆర్థిక, వాణిజ్య పన్నులశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ సంస్థలలో మ్యాన్ పవర్ సేవలను అందించడం కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘ఆప్కా్‌స’ను మానవ వనరుల మినహాయింపు జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన 48వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మంత్రి బుగ్గన వర్చువల్‌గా పాల్గొన్నారు.