వైసీపీ-టీడీపీ గుండాల మధ్య జరుగుతున్న యుద్ధాలు హత్యలు సృతిమించాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరి వల్ల ఏపీలో కంపెనీలు రాష్ట్రాన్ని వదిలి పోతున్నాయి. నిరుద్యోగుల సంఖ్య కోటికి చేరుకుందన్నారు. ఏపీలో అనేక జిల్లాల వారు నన్ను కలిశారని, జీతాలు రావటం లేదని ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారని పాల్ అన్నారు. సీఎం జగన్ అమరావతిపై చట్టబద్దంగా అవినీతికి అక్రమంగా దాడులు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాలకుఅన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. మోడీకి నాకు మధ్య గొడవ జరిగిందని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏం చేసినా కొడుకు కోసమే తప్ప రాష్ట్రం కోసం కాదు అన్నట్లు ఉందని ఆరోపించారు.