కొబ్బరితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. దానిలోని పోషకాలు అవయవాలు చురుగ్గా పనిచేయడానికి దోహదం చేస్తాయి. కొబ్బరిలో పీచు ఉంటుంది. ఇది కొవ్వును కరిగించి జీర్ణవ్యవస్థను చురుగ్గా మారుస్తుంది. బరువు తగ్గాలి అనుకొనే వారికి ఇది చాలా మంచిది. కొబ్బరి శరీరంలో నీటిశాతం కోల్పోకుండా చేస్తుంది. శరీరానికి హాని చేసే కొలెస్ట్రాల్ ను బయటకు పంపేస్తుంది. పచ్చి కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. దెబ్బతిన్న కణాలను వృద్ధి చేయడంలోను కీలకపాత్ర పోషిస్తాయి. విటమిన్ ఎ,బి,సి, థయామిన్, రైబోప్లెవిన్, నియాసిన్, క్యాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఇనుము కొబ్బరిలో పుష్కలంగా లభిస్తాయి. తరుచుగా కొబ్బరిని ఆహారంలో తీసుకునే వారికి మలబద్ధకం, థైరాయిడ్ సమస్యలు దూరంగా ఉంటాయి. కొబ్బరి తినడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది.