ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో అర్జెంటీనా గెలవడంతో మెస్సీ ప్రపంచకప్ కల తీరింది. అయితే క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడు సచిన్ టెండూల్కర్, ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ విజయాల్లో చాలా పోలికలుండటం విశేషం. క్రికెట్ లో సచిన్ 10వ నెంబర్ జెర్సీ ధరిస్తే, ఫుట్ బాల్ లో మెస్సీది కూడా అదే నెంబర్ జెర్సీ. 2003 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో రన్నరప్ తో సరిపెట్టుకున్న సచిన్, ఎనిమిదేళ్ల తర్వాత 2011లో ప్రపంచకప్ ను అందుకున్నాడు. కాగా, 2014 ఫుట్ బాల్ వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమితో నిరాశ చెందిన మెస్సీ, సరిగ్గా ఎనిమిదేళ్లుకు ఇప్పుడు కప్ ను అందుకున్నాడు. 2011 ప్రపంచకప్ సెమీస్ లో సచిన్ మ్యాన్ ఆప్ ద మ్యాచ్ అందుకుంటే, ప్రస్తుతం ఫిఫా వరల్డ్ కప్ సెమీస్ లో మెస్సీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలవడం విశేషం.