సోమవారం ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌మార్కెట్ సూచీలు కాసేపటికే కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లోకి ఎగబాకాయి. ఉదయం సెన్సెక్స్ 135 పాయింట్ల లాభంతో 61,473 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 39 పాయింట్లు లాభపడి 18,308 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.74 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో పవర్‌గ్రిడ్, ITC, నెస్లే ఇండియా, బజాజ్ ఫిన్‌సర్వ్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, మారుతీ, ఎంఅండ్‌ఎం షేర్లు లాభాల్లో ఉన్నాయి. సన్‌ఫార్మా, ఇన్ఫోసిస్, HDFC బ్యాంక్, ఎల్‌అండ్‌టీ, టాటా మోటార్స్, TCS, విప్రో, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.