భార్య అనారోగ్యంతో మృతి చెందడంతో తట్టుకోలేక భర్త ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఏపీ లోని అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది. అమలాపురంకి చెందిన బోనం విజయ్, తులసి భార్యాభర్తలు. ఇటీవల తులసి మెదడుకు శస్త్రచికిత్స చేయించగా, అనారోగ్యంతో ఆదివారం మృతి చెందింది. భార్య ఆరోగ్యం కోసం ఆస్తులమ్మి, అప్పులు చేసిన విజయ్ భార్య మృతితో తట్టుకోలేకపోయాడు. దీంతో ఇంటి పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లితండ్రుల మృతదేహాల ముందు వారి కుమారుడు కృష్ణ బోరున ఏడ్వడం పలువురిని కంటతడి పెట్టించింది.