చలికాలంలో చర్మం త్వరగా పొడిబారుతుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను పోగొట్టుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చలి పెడుతుందని ఎక్కువ సేపు ఎండలో ఉండొద్దు. దీని వల్ల సన్ ఎలర్జీ వచ్చే ఛాన్స్ ఉంది. వేడి, చల్లని నీటితో స్నానం చేయొద్దు. గోరువెచ్చని నీళ్లతో మాత్రమే స్నానం చేయాలి. సన్‌స్క్రీన్ ను వాడాలి. మాయిశ్చరైజర్ వాడటం కూడా మంచిదే. చర్మం కొంత తేమగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ వాడాలి. చర్మానికి చలి, అధిక వేడి తగలకుండా కవర్ చేసే దుస్తులను వాడాలి. గ్లిసరిన్ సబ్బులు వాడాలి. జ్యూస్ లు తాగటం మంచిది. ధూమపానం అలవాటును దూరం పెడితే మంచిది. నీటిని ఎక్కువగా తాగాలి.