గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు చేపడుతున్న సమయంలో 90 శాతం పూర్తి అయిన గ్రామాలకు సంబంధించి పనులను వెంటనే గుర్తించి, అనుమతులు పొంది అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ అన్నారు. ఆదివారం గడపగడపకు మన ప్రభుత్వం కు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని కలెక్టర్ కార్యాలయం నుంచి ఎంపీడీవోలు, ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 3137 పనులను గుర్తించడం జరిగిందని ఇందులో జిల్లా కలెక్టర్ ఆమోదం 1514 పనులకు పూర్తి అయ్యిందని పేర్కొన్నారు.
ఇందులో 100% పనులు 286 పూర్తి కావడం జరిగిందని, మిగతా పనులు వివిధ దశలో ఉన్నాయని అన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో 730 పనులు, పంచాయతీరాజ్ విభాగంలో 616 పనులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో 85 పనులు, 66 పనులు ఇతర ఇంజనీరింగ్ విభాగాలలో జరుగుతున్నాయని తెలిపారు.