ఫిఫా వరల్డ్‌కప్‌లో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే పెనాల్టీ షూటౌట్ ద్వారా మెస్సీ జట్టుకి ఈ విజయం సాకారమైంది. కాగా ఈ పెనాల్టీ షూటౌట్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానొ మార్టినెజ్. అందుకుగానూ అతడు టోర్నమెంట్‌లో ఉత్తమ గోల్‌కీపర్‌గా ఎంపికయ్యాడు. అయితే, ట్రోఫీ అందుకుని వేదికపై ఉన్న అధికారులతో కరచాలనం చేశాక ఎమిలియానొ ప్రవర్తించిన తీరు విమర్శలకు దారితీస్తుంది. అతడు ట్రోఫీతో అలా చేస్తుండగా వ్యాఖ్యాత, మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు గ్యారీ లింకర్ వద్దు, అలా చేయకు ఎమి అనటం కామెంట్రీలో వినిపించింది.