బీహార్ లోని పాట్నా రైల్వే స్టేషన్ లో బాంబు పెట్టామని సోమవారం ఓ ఆగంతుకుడు ఫోన్ చేయడంతో గందరగోళం నెలకొంది. దీంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు పోలీసులను రంగంలోకి దించారు. వెంటనే స్టేషన్ లో హై అలర్ట్ ప్రకటించి.. తనిఖీలు చేపట్టారు. అయితే గాలింపులో ఎలాంటి బాంబు దొరకలేదని సమాచారం. పోలీసులు దీన్ని పుకారుగా పేర్కొంటూ విచారణ చేస్తున్నారు. దీనిపై ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నామని పాట్నా రైల్వే స్టేషన్ ఇంఛార్జీ రంజిత్ కుమార్ తెలిపారు.