యూపీలోని సహ్రాన్ పూర్ జిల్లా పండౌలికి చెందిన మహ్మద్ నావెద్, ఇమ్రాన్ బేగం దంపతులకు షెహ్జాద్ ఆలం(10) కుమారుడు. 2019లో నావెద్ గుండెపోటుతో మరణించగా.. ఆమె కుమారుడిని తీసుకుని యూకే రూర్కీలో కలియార్ షరీఫ్ దర్గా వద్దకు వెళ్లింది. 2021లో ఆమె కరోనాతో మరణించగా బాలుడు షెహ్జాద్ అనాథయ్యాడు. అప్పటి నుంచి అక్కడే భిక్షాటన చేస్తున్నాడు. అయితే బాలుడి తాత మహమ్మద్ యాకుబ్ 2021లో మరణించగా మనవడి పేరు మీద రూ.2 కోట్ల విలువైన భూమిని రాశాడు. దీంతో అతడి బంధువులు రూర్కీలోని బాలుడిని గుర్తించి ఇంటికి తీసుకెళ్లారు.