నోట్ల రద్దు తర్వాత నోట్ల చెలామణి డబుల్ అయ్యిందని పార్లమెంట్ లో కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం చెలామణి అయ్యే నోట్ల విలువ 2016 కంటే రెట్టింపు అని సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2016 మార్చి 31 నాటికి ప్రజల వద్ద రూ.16.41 లక్షల కోట్లు ఉండగా, 2022 డిసెంబర్ 2 నాటికి అది రూ.31.92 లక్షల కోట్లకు చేరిందని వివరించారు. అటు ప్రజల వద్ద ఉన్న నోట్ల సంఖ్య కూడా 30 శాతం పెరిగిందని వెల్లడించారు. 2016 నాటికి ప్రజల వద్ద 9 వేల కోట్ల నోట్లు ఉండగా.. 2022 నాటికి ఆ సంఖ్య 13 వేల కోట్లకు చేరిందని పేర్కొన్నారు.