ఈరోజు విశాఖ స్మార్ట్ సీటీ లో బాగంగా జీవియంసి పరిది భీమిలి జోన్ లో గల 2, 3 వార్డులలో ప్రెమరీ స్కూల్స్ లో 8కోట్ల 21లక్షల రూ నిధులతో అదనపు తరగతి గదులు - ప్లేజోన్స్ - మౌలిక సదుపాయాలు కు భీమిలి నెహ్రూ స్కూల్ లో మాజీ మంత్రి వర్యులు భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన ముత్తం శెట్టి శ్రీనివాసరావు చేతుల మీదుగా శంకుస్థాపనలు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం ను ఉద్దేశించి అవంతి మాట్లాడుతూ విద్యతోనే విజ్ఞానం అనే నినాదంతో నాడు నేడు ద్వారా గత ప్రభుత్వాలు కూడా అందుకోలేనంత స్థాయి లో పలు సంస్కరణలతో కార్యాచరణ చేపట్టి పాఠశాలల ను మౌళిక సదుపాయాల తో సుందరీకరణగా తీర్చిదిద్దడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలను కార్పోరెట్ స్కూల్ లకు దీటుగా చేసి ప్రభుత్వ స్కూల్ లలో ఉత్తీర్ణత శాతం తో పాటు విద్యార్థులు ప్రవేశ శాతం కూడా పెరిగేలా చేసి పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం అనుసరించేలా చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి పాలనలో చదువుకోవాలని ఆశ ఉండి ఫీజులు కట్టుకోలేని వారికి పీజురియంబర్స్మెంట్ పథకం పెట్టి ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యా దానం చేసి వారి మనసుల్లో నిలిచారని, రాజన్న పేదల కోసం పాలనలో ఒకడుగు వేస్తే ఆయన కుమారుడైన జగనన్న పాలన పది అడుగులు వేసి మునుపెన్నడూ లేని సంక్షేమ పథకాల పాలనకు శ్రీకారం చుట్టారని మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో జీవియంసి కార్పోరేటర్ లు ,వార్డు ఇంచార్జ్ లు ,వార్డు ప్రెసిడెంట్ లు ఆయా పదవుల్లో ఉన్న వారు, నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, సచివాలయం సిబ్బంది ,వాలంటీర్లు పాల్గొన్నారు.