బెల్లంలో శరీరాన్ని శుభ్రపరిచే గుణాలు ఉన్నాయి. ఇది సహజంగా శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. చలికాలంలో ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో బెల్లం కలిపి తీసుకోవడం వల్ల తక్షణ శక్తి ఉత్పన్నమైతుంది. ఇది గొప్ప ఔషధ ప్రయోజనాలను అందిస్తుంది. ఇది ఎముకలను బలపరుస్తుంది, కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది, కీళ్లనొప్పులు వంటి ఎముకల వ్యాధులను నయం చేస్తుంది. రక్తహీనతతో బాధపడే వారికి చక్కటి ఔషదం బెల్లంనీరు. ఇది ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ చేయడంలో కూడా సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.