ఇజ్రాయెల్ లో 2 వేల ఏళ్ల నాటి మట్టి క్యాండిల్ లభ్యమైంది. నాలుగో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు కిబ్బట్జ్ పరోడ్ ప్రాంతంలో దీన్ని గుర్తించారు. నేలకు అతుక్కొని ఉన్న క్యాండిల్ చూసి వారు ఏదో ప్రత్యేకమైన రాయిగా భావించారు. దాన్ని తల్లిదండ్రుల సాయంతో ఇజ్రాయెల్ పురావస్తు అధికారుల దగ్గరికి తీసుకెళ్లారు. వారు దాన్ని పరీక్షించి అది 2 వేల ఏళ్ల నాటి అరుదైన క్యాండిల్ అని తేల్చారు. ఈ క్రమంలో విద్యార్థులను అధికారులు అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు.