ప్రతి రోజూ మద్యం తాగి ఇంటికి వస్తున్నాడని ఓ కొడుకును చంపిన తండ్రి గోనెసంచిలో మృతదేహాన్ని దాచాడు. ఈ ఘటన యూపీలోని అలీఘర్ లో జరిగింది. గోండా పోలీస్ స్టేషన్ పరిధిలోని తారాపూర్ గ్రామానికి చెందిన 24 ఏళ్ల రవి మద్యం తాగి వచ్చి తన తండ్రి జయప్రకాష్ తో ఈ నెల 14న గొడవ పడ్డాడు. అనంతరం అతను కనపించలేదు. మేనల్లుడి అదృశ్యంపై మేనమామ పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటపడింది. పొలంలోని సంచిలో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa