వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేసే సత్తా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఉందా? అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సవాలు విసిరారు. గత ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవదు శాసనం అని చెప్పిన మాటలు పవన్ కళ్యాణ్ మర్చిపోయాడా..? 2019లో అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వనని చెప్తే ప్రజలు పవన్‌ను గేటు కూడా తాకనివ్వలేదని కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ వారాలబ్బాయి అంటూ ఎద్దేవా చేశారు. వైయస్ జగన్ నిలబెట్టిన అభ్యర్థుల మీద ఓడిపోయిన నువ్వు ముఖ్యమంత్రిని విమర్శించడమా..? నీ స్థాయికి మించి మాట్లాడుతున్నావు అని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో పవర్ లేని స్టార్.. అంటూ ఎద్దేవా చేశారు. కాల్షీట్ ఉంటే ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు, కాల్షీట్స్ ఖాళీ అయితే చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకుంటాడు అంటూ ఆరోపణలు గుప్పించారు.