ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారంలో మంత్రి అంబటి రాంబాబు లంచం అడిగారంటూ కొందరు బాధితులు ఆరోపించారు. సత్తెనపల్లి ఓ రెస్టారెంట్ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా తమ కొడుకు చనిపోయాడని... ఇందుకు గాను ప్రభుత్వం నుంచి ఐదు లక్షల పరిహారం వచ్చిందని బాధితులు తెలిపారు. అయితే ఐదు లక్షల చెక్కు ఇవ్వాలంటే రూ.2.50 లక్షల లంచం ఇవ్వాలని మంత్రి అంబటి రాంబాబు, మున్సిపల్ ఛైర్మన్ భర్త సాంబశివరావులు అడిగారని ఆరోపించారు. తమ కొడుకు మృతితో వచ్చే డబ్బులతో తమ కుమార్తె పెళ్ళి చేసుకుందాం అనుకున్నామని తెలిపారు. అంబటి రాంబాబు లంచం విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఆశ్రయించామని... పవన్ వచ్చి వెళ్లిన నాటి నుంచి వైసీపీ నుంచి బెదిరింపులు వస్తున్నాయని వాపోయారు. తమ కొడుకు మృతి పరిహారం చెక్కు ఇప్పించాలని బాధితులు వేడుకుంటున్నారు. అందుకేనేమో పవన్ కళ్యాణ్ , అంబటిని సేవల మీద పేలాలు ఏరుకునేవాడు అన్నట్లు ఉన్నారు.