వ్యాయామం ఆరోగ్యానికి చాలా అవసరం. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గించగలవు. వ్యాయామాల్లో స్కిప్పింగ్ ఒకటి. స్కిప్పింగ్ బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో సహాయపడుతుంది. దీనివల్ల శరీరంలో ఉన్న అదనపు కేలరీలు కరిగిపోతాయి. స్కిప్పింగ్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్కిప్పింగ్ వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది. తద్వారా గుండె ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంటుంది. స్కిప్పింగ్ మెదడుపై అనుకూల ప్రభావాన్ని చూపెడుతుంది. రోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరం హుషారుగా మారుతుంది. స్కిప్పింగ్ మానసిక స్థితిని మెరుగుపరిచే ఎండార్ఫిన్ల ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది.