పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతాలో విషాదం జరిగింది. లేడీ బ్రబౌర్న్ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థిని రౌనక్ అహ్మద్ సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమె డైరీలో సూసైడ్ నోట్ గుర్తించారు. అందులో ‘ఎవరూ నన్ను ప్రేమించడం లేదు. నేను ఏమీ చేయలేను’ అని రాసి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. ఇదే కారణమా లేక మరేదైనా ఒత్తిడి ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.