ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాధపురం లక్ష్మీ నరసింహ ఆలయ గుమస్తా, అర్చకుడిని అధికారులు విధుల నుంచి తొలగించారు. విరాళాల నిధులలో ఆలయ గుమాస్తా, అర్చుకుడు గోల్మాల్కు పాల్పడ్డారు. నెల రోజుల క్రితం ఆలయానికి ఓ భక్తుడు రూ.10 వేలు విరాళంగా ఇచ్చాడు. అయితే భక్తుడు రూ.6 వేలు మాత్రమే ఇచ్చినట్లు గుమాస్తా రికార్డుల్లో నమోదు చేశాడు. దీనిపై విచారణ జరిపిన ఆలయ అధికారులు... ఇద్దరిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.