యూట్యూబ్ ఇప్పుడు విద్యా సంబంధిత వ్యాపారంలోకి అడుగు పెడుతోంది. ‘యూట్యూబ్ లెర్నింగ్’ పేరుతో కోర్సులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. బైజూస్, ఆకాశ్, అన్ అకాడమీ తదితర సంస్థలకు యూట్యూబ్ గట్టి పోటీ ఇవ్వనుంది. సబ్ స్క్రిప్షన్ విధానంలో యూట్యూబ్ కోర్సులను ఆఫర్ చేయనుంది. నిపుణులు అందేంచే కంటెంట్ యూట్యూబ్ చూసి నేర్చుకోవచ్చు. కంటెంట్ క్రియేటర్లతో ఒప్పందం చేసుకుని ఈ కోర్సులు ఆఫర్ చేయనుంది. 2023 మొదటి 6 నెలల్లనే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. యూట్యూబ్ ఎంపీ ఇషాన్ ఛటర్జీ అనధికారికంగా దీనిపై ప్రకటన చేశారు.