విజయవాడ జవహర్ ఆటోనగర్‌లో మెకానిక్ సంఘానికి విశిష్ట స్థానం ఉందని సంఘం అధ్యక్షుడు గంధం వెంకటేశ్వరరావు (కొండా) అన్నారు. సోమవారం ఆటోనగర్‌లోని ఆటో మొబైల్ టెక్నిషియన్ అసోసియేషన్ హాలులో మెకానిక్ సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గంధం మాట్లాడుతూ.... ఆటోనగర్‌ను తరలిస్తారని ప్రచారం జరుగుతుందని, లక్షమంది కార్మికులు ఉపాధి పొందే కార్మికవాడను తరలించడం అంత తేలికైన విషయం కాదన్నారు. ప్రభుత్వం ప్రయత్నిస్తే తీవ్రమైన పోరాటం చేస్తామన్నారు. గౌరవ అతిథిగా పాల్గొన్న ఏటీఏ అధ్యక్షుడు రాజనాల వెంకట రమణ రావు మాట్లాడుతూ... సంఘాలు నిర్వహించే సమావేశాల వలన సభ్యుల మధ్య బంధం బలోపేతం అవుతుందన్నారు. మాజీ అధ్యక్షుడు గొల్లపూడి నాగేశ్వరరావు సంఘం ఆర్థికాభివృద్ధికి పలు సూచనలు చేశారు. కార్యదర్శి షేక్ దస్తగిర్ కార్యదర్శి నివేదికను, కోశాధికారి మైలు రామ్మోహనరావు గత ఏడాది జమాఖర్చులు తెలిపారు. సమావేశంలో ఉపాధ్యక్షుడు ఐనాల ఉమామహేశ్వరరావు, సయ్యద్ రియాజ్, రేఖపల్లి రామకృష్ణ ప్రసాద్, సహాయ కార్యదర్శులు తోట శంకర్రావు, వేమూరి చంద్రమోహన్, లక్కింశెట్టి కనకరావు, మరడ కుమారరంగా, పంచల గంగాధరరావుతో పాటు రెండు వేల మంది సభ్యులు పాల్గొన్నారు.