ఉల్లి రసంతో జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయ రసంలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఇది తలపై రక్తప్రసరణను పెంపొందించి కొత్త జుట్టు పెరిగేలా దోహదం చేస్తుందని డాక్టర్లు అంటున్నారు. సల్ఫర్తో పాటు ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, పొటాషియం, ప్రోటిన్ వంటి మూలకాలు ఉండడంతో ఉల్లిపాయ రసం జుట్టుకు ఎంతో మేలు చేస్తుందని వివరిస్తున్నారు. అయితే డాక్టర్ల సలహా మేరకు దీనిని వాడితే మంచిదని సూచిస్తున్నారు.