ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రావాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ తులసిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టులు రాష్ట్రానికి సంజీవిని లాంటివన్నారు. విభజన చట్టంలోని హామీలు, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీలు సాధించుకునే విషయంలో టీడీపీ, వైపీపీ విఫలమయ్యా యన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని, పోలవరం పూర్తికి నిధులు ఇవ్వలేమని పార్లమెంట్‌లో బీజేపీ ప్రక టన దారుణమన్నారు. రాష్ట్రంలో చేతకాని పాలకుల వల్ల ఇలా జరుగుతోందని దుయ్యబట్టారు. దేశంలో ఇప్పటికే 10 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రత్యేక హోదా అమలులో ఉందన్నారు. కేంద్రం ప్రత్యేక హోదా ప్రకటిస్తే 90 శాతం రాయితీలు వస్త్తాయని, అప్పుడు పెట్టుబడిదారులు, వ్యాపారులు మందుకు రావడంతో నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. పోలవరం పూర్త యితే 7.2 లక్షల ఎకరాల ఆయకట్టుకు కొత్తగా సాగునీరు అభించడమే కాకుండా 10.13 లక్షల ఎకరాల్లో స్థిరీకరణ జరుగుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికి మరో రూ.55 వేల కోట్లు అవసరమని, అందులో రూ.2442 కోట్లు ఇస్తామని కేంద్రం ప్రకటించడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు, నేతలు చీకటి చార్లేస్, తిరుమలేశు, సుబ్బారెడ్డి, మధురెడ్డి, ఓబయ్య తదితరులు పాల్గొన్నారు.