తోటపల్లిగూడూరు, మండలంలోని మల్లికార్జునపురం గిరిజన కాలనీకి చెందిన బర్రె పూజిత(23) ఆదివారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆ ఫిర్యాదును సోమవారం ఉపసంహరించుకున్నారు. పూజిత కుటుంబంలో చిన్న చిన్న కలతలు ఉండేవని, క్షణిక్షావేశంలో ఉరి వేసుకుందని, విషయం తెలియక పోలీస్ స్టేషన్లో తమ అల్లుడు ఆకాష్‌పై ఫిర్యాదు చేశామని కుటుంబీకులు తెలిపారు. ఆ తర్వాత పొరపాటు తెలుసుకుని ఫిర్యాదును ఉపసంహరించుకున్నట్లు వారు పేర్కొన్నారు. కాగా ఫిర్యాదును కుటుంబ సభ్యులు వెనక్కు తీసుకున్నట్లు ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు.