కందుకూరు నియోజకవర్గం లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుడ్లూరు మండల పరిధిలోని మోచేర్ల గ్రామ సమీపంలో రహదారి మరమ్మతులు చేస్తున్న కార్మికులపై లారీ దూసుకెళ్లిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు సంఘటన ప్రదేశంలో దుర్మరణం పాలయ్యారు. మరో ఇరువురికి తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. గాయపడిన వారిని కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం గుడ్లూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.