ఆంధ్రప్రదేశ్ లో మహిళలపై ఏటా అఘాయిత్యాలు పెరుగుతున్నాయని కేంద్రం వెల్లడించింది. మహిళల ఆత్మగౌరవానికి భంగం వాటిల్లిన కేసుల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల కంటే ఏపీలోనే మహిళలపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని కేంద్రం వివరించింది. 2018 నుంచి పోల్చితే 2021 నాటికి ఏపీలో అత్యాచారాలు 22%, దాడులు 15%, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే కేసులు 31% పెరిగాయి అని కేంద్రం తెలిపింది.