వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరోసారి అరుదైన గౌరవం దక్కింది. రాజ్యసభ ప్యానెల్ వైస్ ఛైర్మన్ గా విజయసాయిరెడ్డి మరోసారి ఎన్నికయ్యారు. వాస్తవానికి 10 రోజుల క్రితమే విజయసాయిని ప్యానెల్ వైస్ ఛైర్మన్ గా నియమించారు. అయితే, ఆ తర్వాత చోటుచేసుకున్న కొన్ని పరిణామాలతో ఆయన పేరును తొలగించారు. ఇప్పుడు మళ్లీ ఆయనను ప్యానెల్ వైస్ ఛైర్మన్ గా నియమించారు. ఈ మేరకు భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ ప్రకటించారు. పరుగుల రాణి పీటీ ఉషను కూడా ప్యానెల్ వైస్ ఛైర్మన్ గా నియమించారు. ఈ సందర్భంగా ఇద్దరికీ జగదీప్ ధన్కర్ అభినందనలు తెలిపారు. ప్యానెల్ వైస్ ఛైర్మన్ గా ఒక నామినేటెడ్ ఎంపీ (పీటీ ఉష) నియామకం కావడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa