మందార పూలతో చేసిన టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు ఆరోగ్యనిపుణులు. తాజా మందార ఆకులు, దాని ఎండిన ఆకులను ఉపయోగించి టీ తయారు చేయవచ్చు. అందులో తేనె కలుపుకుని తాగాలి. మందార టీ తాగితే బ్యాక్టీరియా, ఫంగస్ వంటి అనేక రకాల శారీరక ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండవచ్చు. దానిలోని యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇది బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. ఖనిజాలతో సమృద్ధిగా ఉన్న మందార టీ జుట్టును బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది.