విభేదాలు మాని పార్టీ అభివృద్ధికి అందరూ కష్టపడి పని చేయాలని జిల్లా టిడిపి అధ్యక్షుడు బి కే పార్థసారథి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప పిలుపునిచ్చారు పుట్టపర్తి టిడిపి కార్యాలయంలో నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. గ్రామ, మండల, నియోజకవర్గ అధ్యక్షులు మండల కన్వీనర్లు, కార్యదర్శులు పార్టీ అనుబంధ సంస్థల నాయకులు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. బూతు లెవెల్ కమిటీ నాయకులు మొదలుకొని నాయకులందరూ సభ్యత్వ నమోదు పూర్తి చేయాలన్నారు. ఇప్పటి నుంచే ఓటర్ లిస్టులో అవకతవకలు ఉంటే సరి చేసుకోవాలని వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలన్నారు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంలో దౌర్జన్యాలు అధికమయ్యాయని అధికారంలోకి ఈసారి రాకుంటే తీవ్రంగా నష్టపోతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పార్టీలో పదవులు పొందిన నాయకులకు పూలమాలలు, శాలువాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, రాష్ట్ర, జిల్లా నాయకులతో పాటు అంబికా లక్ష్మీనారాయణ, ఎల్ఐసి నరసింహులు, మహమ్మద్ రఫీ, సామకోటి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.