శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం పోలిస్ స్టేషన్ నందు ఎక్సైజ్ కేసులలో పట్టుబడిన మొత్తం 65 వాహనాలలో 59 ద్విచక్రవాహనాలు, 2 ఆటోలు, 4 కార్లలను ఈ నెల 24వ తేదీన రొద్దం పోలిస్ స్టేషన్ నందు పెనుకొండ ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో బహిరంగ వేలం వేయబడునని ఎస్ ఐ తెలిపారు. ఇందుకు సంభందించిన వివరాలను తెలుసుకొనుటకు గాను రొద్దం పోలిస్ స్టేషన్ వారిని సంప్రదించి, వివరాలను తెలుసుకొనగలరని , వేలం పాటలో పాల్గోనదలచినవారు తగిన ధరావత్తు చెల్లించి దానికి తగిన రశీదు పొంది వేలం పాటలో పాల్గొనగలరని, వేలం పాటలో పాల్గోనదలచినవారు వారి అధార్ వెంట తెచ్చుకొని అధార్ కార్డ్ జిరాక్స్ ఇవ్వవలెనని తెలిపారు.