రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆరవ తరగతి నుండే డిజిటల్ క్లాసులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. వచ్చే ఏడాది జూన్ నాటికి నాడు- నేడు కార్యక్రమంలో భాగంగా 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు డిజిటల్ క్లాసులు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. "ఆరవ తరగతి నుండి ప్రతి సెక్షన్ లోనూ డిజిటల్ క్లాసులు ఉంటాయి. నాడు-నేడు పూర్తైన పాఠశాలల్లో తొలుత అందుబాటులోకి తీసుకొస్తాం. అమ్మఒడి పథకంలో భాగంగా మూడేళ్లలో రూ.19,617 కోట్లు విద్యార్థుల తల్లులకు అందించాం" అని సీఎం తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa