హైట్ తక్కువగా ఉన్నామని చాలామంది నిరాశకు గురవుతుంటారు. సాధారణంగా మనిషి ఎత్తును 60-80% జీన్స్ నిర్ధారిస్తే మిగిలిన 40 -20% మన చేతుల్లోనే ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 19 ఏళ్ల వయసు వచ్చే వరకూ ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది. ఎదిగే వయసులో తగిన మోతాదులో విటమిన్లు, మినరల్స్ ఇతర పోషకాలు శరీరానికి అందేలా చూసుకోవాలి. ఇక ఎముకలు, కండర పుష్టికి అవసరమైన విటమిన్ డీ, క్యాల్షియం సరైన మోతాదులో తీసుకోవాలి. కంటినిండ నిద్రతో పాటు సరైన భంగిమంలో పడుకోవడం కూడా ముఖ్యం. నిలుచున్న సమయంలోనూ వెన్నెముక నిటారుగా ఉంచాలని, వంగినట్టుగా నడవడం, నిల్చోవడం చేయకూడదు.