రోడ్డుపై మూత్రం పోయొద్దన్నందుకు ఓ వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేశాడు. ముంబైలోని ఏక్తా నగర్‌కు చెందిన రామ్ గొంటే కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత రాత్రి కండివాలిలో రోడ్డుపై మూత్ర విసర్జన చేస్తుండగా గమనించిన ఉదయ్ కదమ్ అనే కానిస్టేబుల్ అతడిని అడ్డుకున్నాడు. బహిరంగంగా మూత్రం పోయొద్దని, పబ్లిక్ టాయ్‌లెట్‌ను ఉపయోగించుకోవాలని సూచించాడు. దీంతో అతడు కానిస్టేబుల్‌తో గొడవకు దిగాడు. తీవ్ర ఆగ్రహంతో తన కూరగాయల బండిపై ఉన్న కత్తితో కానిస్టేబుల్‌పై దాడిచేశాడు. దీంతో కానిస్టేబుల్ రెండు చేతులకు తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కానిస్టేబుల్ ను ఆసుపత్రికి తరలించి నిందితుడిని అరెస్టు చేశారు.