వైయస్సార్సీపి ప్రభుత్వంతోనే విద్యాభివృద్ధికి పెద్దపీట వెయ్యడం జరుగుతుందని మదన గోపాలపురం, కే బోయినపల్లి ఎంపీటీసీ మధుబాబు అన్నారు. బుధవారం ఎం జి పురం గ్రామపంచాయతీలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి నిరుపేద విద్యార్థులు ఉన్నతమైన విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో నాడు నేడుతో ప్రభుత్వ పాఠశాల రూపురేఖలను మార్చడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ సిపి నాయకులు కొండూరు విశ్వనాథరాజు, సర్పంచ్ పెంచలయ్య, సందీప్ రాజు, బాబు యాదవ్, సాయి యాదవ్, సుదర్శన్ యాదవ్, కుర్ర వెంకటేష్, హెడ్మాస్టర్ చంద్రశేఖర్, ఇంజనీర్ అసిస్టెంట్ తేజ, రాము, భాస్కర్, జయరాం, శివయ్య, ఇంద్ర, హరి, విశ్వనాథ్ సచివాలయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.