కాంగ్రెస్ నేత రాజా పటేరియా బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లోని ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు తిరస్కరించింది. ‘‘ప్రధాని మోదీని చంపేయండి’’ అంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా ప్రత్యేక కోర్టు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ మహేంద్ర సోనీ ఇరుపక్షాల వాదనలను విని ప్రభుత్వ సలహాదారు సమర్పణలతో ఏకీభవించారు. రాజాపటేరియా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించారు.