సంక్షేమం పేరు చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందని శృంగవరపుకోట మాజీ శాసన సభ్యురాలు కోళ్ల లలిత కుమారి అన్నారు. శృంగవరపుకోట మండలం కాపు సోంపురం గ్రామంలో గురువారం ఎస్. కోట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జి యస్ యస్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఇదేం కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి గ్రామంలో గడపగడపకు వెళ్లి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నినాదాలు చేస్తూ ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన 9261292612 అనే నెంబర్కు సమస్యలతో బాధపడుతున్న ప్రజలు మిస్డ్ కాల్ ఇవ్వాలని ఆమె కోరారు.
ఈ ప్రభుత్వ పాలనలో సామాన్య, మధ్యతరగతి, పేద కుటుంబాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ప్రజలు బలపరచాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ కోఆర్డినేటర్ ఇందుకూరి శ్రీనివాసరావు, టిడిపి నాయకులు తూర్పాటి ఆదిబాబు, అల్లూరి సత్తిబాబు, రాజు, రమణబాబు, ఇందుకూరి శ్రీను రాజు, అప్పలనాయుడు, మహేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.