ప్రకాశం జిల్లా గిద్దలూరు టిడిపి ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి బుధవారం రోజు అర్ధవీడు మండలం యాచవరం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. తర్వాత ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరించి 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.