ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రుణాలు మంజూరులో అవకతవకల కేసులో,,,చందా కొచ్చర్, ఆమె భర్త అరెస్ట్

national |  Suryaa Desk  | Published : Sat, Dec 24, 2022, 11:13 AM

ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ లను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వీడియోకాన్ గ్రూప్ కు రుణాలు మంజూరు చేయడంలో అవినీతికి, అవకతవకలకు పాల్పడినట్టు నమోదైన కేసులో వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అవినీతి ఆరోపణల నేపథ్యంలోనే 2018లో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో బాధ్యతల నుంచి చందా కొచ్చర్ వైదొలిగారు. 


కేసు వివరాల్లోకి వెళ్తే బ్యాంక్ సీఈవో హోదాలో 2012లో వీడియోకాన్ గ్రూప్ కు రూ. 3,250 కోట్ల రుణాన్ని చందా కొచ్చర్ మంజూరు చేశారు. ఆ తర్వాత అది ఎన్పీఏగా మారింది. దీనిపై విచారణ జరిపిన సీబీఐ ఈ వ్యవహారం ద్వారా చందా కొచ్చర్ కుటుంబం లబ్ధి పొందిందని అభియోగాలు మోపింది. ఈ క్రమంలోనే కొచ్చర్ దంపతులను సీబీఐ అరెస్ట్ చేసింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa