బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని మార్టూరు, ఇంకొల్లు, యద్దనపూడి, చీరాల నియోజకవర్గం లోని చీరాల 1 టౌన్, చీరాల II టౌన్, చీరాల రూరల్, వేటపాలెం పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎన్ డి పి ఎస్ చట్టం-1985 క్రింద నమోదుచేయబడిన 24 కేసులలో సీజ్ చేసిన గంజాయిని పేరేచర్ల సమీపంలోని కైలాసగిరి పోలీస్ ఫైరింగ్ రేంజ్ నందు శనివారం ధ్వంసం చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ వర్మ మాట్లాడుతూ గంజాయి సాగు, అక్రమ రవాణాను అరికట్టే దిశగా పోలీస్ శాఖ చేపట్టిన అపరేషన్ పరివర్తన్ రెండవ దశలో భాగంగా స్వాధీనం చేసుకున్న గంజాయిని ధ్వంసం చేయడం జరిగిందని వివరించారు. బాపట్ల జిల్లా ఎస్పీ జిందాల్ , చీరాల, బాపట్ల డిఎస్పీలు శ్రీకాంత్, శ్రీనివాసరావు, పలువురు సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.