పుల్లలచేరువు మండలం ముటుకుల నుంచి గుట్లపల్లి వెళ్లే రోడ్డుకు మంత్రి సురేష్ చొరవతో మహర్దశ పట్టింది. రోడ్డు ప్రమాదాలు, గుంతల మాయమైన రోడ్డుకు 55 లక్షల రూపాయలు నిధులను మంత్రి మంజూరు చేయించారు. దాంతో అధికారులు చక చక పనులు ప్రారంభించి త్వరితగతిన రోడ్ నిర్మాణం పనులు పూర్తి చేశారు. ఈ రహదారి పూర్తి కావడంతో పుల్లలచెరువు- వినుకొండ రాకపోకలకు సౌకర్యవంతంగా మారి ఎన్నో ఏళ్ల నాటి సమస్యకు పరిష్కారం కలిగిందని ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.