ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో ఎన్నికలు ఎన్నికైన కౌన్సిలర్ కంటే బ్రోకర్లదే హావా నడుస్తుందని కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఎర్రగుంట్ల మున్సిపల్ సాధన సమావేశం జరిగింది .ఈ సమావేశంలో కొందరు కౌన్సిలర్లు తమ ఆవేదనను వ్యక్తం చేశారు . మున్సిపల్ కార్యాలయంలో కోఆప్షన్ సభ్యులు ఉన్న ఓ వ్యక్తి తమ ఆహ్వానం నడిపిస్తూ బ్రోకర్ గా చలామవుతున్నారన్నారు కమిషన్లకు పాల్పడే వారికి విలువ ఇస్తున్నారని ఆగ్రహించారు . వార్డులలో ఒక పని కూడా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మూల సుధీర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి ల సమక్షంలో చెప్పిన పనులను కూడా మున్సిపల్ అధికారులు చేయలేదని ప్రశ్నించారు సమావేశం కౌన్సిలర్ అందరు తమ వార్డులలో సమస్యలు పరిష్కరించలేని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు సచివాలయంలో కౌన్సిలర్లకు విలువ లేకుండా పోయిందని సచివాల ఉద్యోగులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు . మున్సిపల్ కార్యాలయంలో కూడా కోఆప్షన్లకు ఉండే విలువ కౌన్సిలర్లకు ఇవ్వలేదని కేవలము సమావేశాలకు మాత్రమే కౌన్సిలర్లను ఉపయోగించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు . మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్ల కంటే బ్రోకర్లకే ఎక్కువ ప్రాధాన్తిస్తున్నారని వాపోయారు.